Crocodile : Crocodile : కొచ్చెర ఉర చెరువులో మొసలి కలకలం

by Kalyani |
Crocodile : Crocodile :  కొచ్చెర ఉర చెరువులో మొసలి కలకలం
X

దిశ,బాల్కొండ 29 :మెండోరా మండల కేంద్రంలో కొచ్చెర ఉర చెరువులో సోమవారం మొసలి బండ మీదకి వచ్చి ప్రత్యక్షమయ్యింది.ఈ సందర్భంగా గ్రామ శివారులో ఉన్న చెరువులో మొసలి కనబడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఉర చెరువులో ఇంకా అనేక మొసలిలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామం పక్కనే చెరువు ఉండటంతో గ్రామంలోకి మొసలి ఎప్పుడు వచ్చి దాడి చేస్తాదో అని భయపడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు ప్రమాదాలు జరగకముందే చెరువులో ఉన్న మొసలిని పట్టుకొని జూ కి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story

Most Viewed