కానిస్టేబుల్ వికృత చేష్టలు

by Sridhar Babu |
కానిస్టేబుల్ వికృత చేష్టలు
X

దిశ, బోధన్ : రెంజల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఓ కానిస్టేబుల్ నవీపేట్ మండలం యంచ గ్రామంలో ఓ వివాహితతో జరుపుతున్న అక్రమ సంబంధం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు మహిళ భర్త పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రెంజల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే బర్ల ప్రవీణ్ నవీపేట్ మండలం యంచ గ్రామంలోని ఒక వివాహితతో అక్రమ సంబంధం

ఏర్పరచుకొని తరచుగా వస్తూ ఉండేవాడని, ఈ వ్యవహారంలో సదరు ఫిర్యాదు దారుడికి తన భార్య పై అనుమానం రావడంతో ఈ నెల 7వ తరీఖున మాటువేసి ఉండగా రాత్రి 10 గంటల సమయంలో సదరు కానిస్టేబుల్ వివాహితతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో మహిళ భర్త పట్టుకొవడంతో సదరు కానిస్టేబుల్ ను స్థానికులు చితకబాది నవీపేట్ పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో తనను కులం పేరుతో దూషించిన సదరు కానిస్టేబుల్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మహిళ భర్త ఏసీపీ కి ఆదివారం ఫిర్యాదు చేశాడు.

విచారణ ప్రారంభం..

మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ బర్ల ప్రవీణ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సదరు మహిళ భర్త చేసిన ఫిర్యాదుతో కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

Next Story