- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏర్గట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన..
దిశ, ఏర్గట్ల : మండల కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై పెంచిన ధరలకు నిరసనగా కట్టెల పొయ్యి పై వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 420 రూపాయలు ఉన్న సిలిండర్ ప్రస్తుతం 1180 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంతలా పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలపై బారం పడుతుందన్నారు.
ప్రజలు మోడీ ప్రభుత్వం ఏదో చేస్తుందని రెండుసార్లు అధికారమిస్తే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసి, ప్రభుత్వ ఆస్తులను అమ్మడం పేద ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని లేదంటే ఇలాంటి నిరసన కార్యక్రమాలు క్రమంగా కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుల్లే లావణ్య గంగాధర్, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, ఎంపీటీసీ జక్కని మధు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎనుగందుల రాజాపూర్ణానందం, గ్రామ శాఖ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, మండల మైనారిటీ అధ్యక్షులు జైనోద్దీన్, కో ఆప్షన్ మెంబర్ అశ్రఫ్, సీనియర్ నాయకులు రాజారాం సహదేవ్, బర్మ చిన్న నర్సయ్య, నాయకులు, కార్యకర్తలు, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.