- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గాంధారి వాసుల కల సాకారానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
దిశ, గాంధారి: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గాంధారి వాసుల కల త్వరలోనే నిజం కానుంది. గాంధారిలో మీని స్టేడియం ఏర్పాటు చేయాలని స్థానిక యువతతో పాటు ప్రజలు చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను గుర్తించిన కాంగ్రెస్ నేత మదన్ మోహన్.. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే గాంధారిలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో జరిగిన సార్వత్రి ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మదన్ మోహన్‌ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
దీంతో ఎన్నికల ప్రచారంలో గాంధారి వాసులకు ఇచ్చిన హామీపై ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టి సారించారు. గాంధారిలో మినీ స్టేడియం ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు. ఎంత స్థలం, ఎన్ని నిధులు కావాలనే అంశంపై స్థానిక అధికారులతో చర్చించి అంచనాల ప్రాతిపాదనలను రెడీ చేయించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మదన్ మోహన్ కలిసి.. గాంధారిలో మినీ స్టేడియం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ సెక్రటరీ సిద్ధు వెల్లడించారు. గాంధారిలో మినీ స్టేడియం ఏర్పాటుకు ఎల్లారెడ్డి రెవెన్యూ అధికారులు 5 ఎకరాల స్థలాన్ని సేకరించారని సిద్ధు తెలిపారు.
గాంధారిలో మినీ స్టేడియం ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకుల పాత్ర కీలకమైందని సిద్ధు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల సహకారంతోనే ఎమ్మెల్యే దృష్టికి స్టేడియం ఏర్పాటు అంశం వెళ్లిందని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మదన్ మోహన్ కలిసి గాంధారిలో మినీ స్టేడియం ఏర్పాటుపై చర్చించడంతోనే ఏన్నో ఏళ్ల కళ సాకారమవుతోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ సెక్రటరీ సిద్ధు తెలిపారు.
అయితే గాంధారిలో మినీ స్టేడియం ఏర్పాటు సహకారమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో యువకులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఆయనపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పొగడ్తలు కురిపిస్తున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.