- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kamareddy : రాజధాని టు కామారెడ్డి.. సెక్స్ రాకెట్ లో మరోకోణం..
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంగా సాగుతున్న వ్యభిచారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు కేవలం రెండు వేలలోపే జరుగుతుందనుకున్న వ్యాపారం.. పూటకు 10 వేలకు పైగానే జరుగుతున్నట్టుగా సమాచారం. లోకల్ అమ్మాయి కావాలంటే 500 నుంచి 2 వేలు చెల్లిస్తే చాలు. కానీ అందమైన అమ్మాయిలు కావాలంటే ఆ మాత్రం రేటు ఇచ్చుకోవాల్సిందే. అది కూడా ఓ నాలుగైదు వేలు అనుకునేరు సుమా.. ఏకంగా 10 వేలకు పైగానే అందమైన అమ్మాయితో సెక్స్ చేయడానికి ఛార్జ్ చేస్తున్నారు సెక్స్ రాకెట్ నిర్వాహకులు.
విటులకు అందమైన అమ్మాయిల ఫోటోలు..
సెక్స్ పై ఇంట్రెస్ట్ ఉన్న విటులకు అందమైన అమ్మాయిల ఫోటోలను నిర్వాహకులు పంపిస్తున్నట్టుగా తెలిసింది. అమ్మాయిని సెలెక్ట్ చేసిన దానిని బట్టి రేటును నిర్ణయిస్తున్నారు. లోకల్ గా ఉన్న అందమైన అమ్మాయిలు అయితే పూటకు 5 వేల వరకు ఛార్జ్ చేస్తుండగా, నాన్ లోకల్ అమ్మాయిలకు ఏకంగా 10 వేలకు పైగా ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే అమ్మాయిలు ఎక్కడినుంచి వస్తున్నారనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నట్టుగా సమాచారం. అమ్మాయి ఎప్పుడు కావాలి, ఎక్కడికి తీసుకురావాలి అనే విషయాలు మాత్రమే విటుల నుంచి సేకరించి డబ్బులను ఆన్లైన్ పేమెంట్ కాకుండా నగదుగానే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
రాజధాని నుంచి అమ్మాయిల సరఫరా..?
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి అమ్మాయిలను కామారెడ్డికి రప్పిస్తున్నారా..? అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిలకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారా..? రాకపోకలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి అందమైన అమ్మాయిలను రప్పించడం కోసం విటుల నుంచి భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విటుల స్థాయిని బట్టి 10 వేల నుంచి మొదలుకుని 20 వేల వరకు తీసుకుంటున్నట్టుగా సమాచారం. హైదరాబాద్ నుంచి రావడానికి ప్రత్యేకంగా వారికి రవాణా ఛార్జీలను కూడా ఇస్తున్నట్టుగా తెలిసింది.
అమ్మాయిల ఫోన్ నంబర్లు చేంజ్..
హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వస్తున్న అమ్మాయిలు గత రెండు రోజుల క్రితం కామారెడ్డికి వచ్చినట్టుగా తెలిసింది. ఇక్కడికి వచ్చిన సమయంలోనే దిశలో వస్తున్న కథనాలు వారి దృష్టికి వెళ్లినట్టుగా తెలిసింది. దాంతో ఈ వ్యాపారం గుట్టు రట్టైతే తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇక్కడి నిర్వహకులతో నిత్యం టచ్ లో ఉండాల్సి వస్తుండటంతో తాజాగా నిన్ననే వారి ఫోన్ నంబర్లు మార్చి నిర్వాహకులకు అందజేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక పై పాత నంబర్లలో తాము అందుబాటులో ఉండటం లేదని చెప్పినట్టుగా తెలిసింది.
పోలీసుల ముమ్మర విచారణ..
దిశ పత్రికలో సెక్స్ రాకెట్ పై వస్తున్న వరుస కథనాల పై పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ఎక్కడెక్కడ పోస్టర్లు అతికించారో తెలుసుకోవడానికి సీసీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. పోస్టర్లు అంటించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని పై కేసు నమోదు చేస్తామని కూడా వెల్లడించారు. గత నాలుగు రోజుల క్రితం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో వ్యభిచార గృహం పై పోలీసులు దాడులు చేసి బాధిత మహిళలను సఖి సెంటర్ కు తరలించినట్టుగా తెలిసింది. దేవునిపల్లి గ్రామంలోని కాకతీయ నగర్ కాలనీకి చెందిన వ్యక్తి ఒకరు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. గతంలో కూడా పోలీసులు అనేక చోట్ల దాడులు జరిపి పలువురు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ప్రస్తుతం మళ్ళీ దిశపత్రిక ద్వారా వ్యభిచారం విషయం బయటకు రావడంతో పాత కేసులను పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.