ఆర్మూర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం.. 4 తులాల బంగారంతో పాటు లక్ష 80 వేల నగదు అపహరణ

by Kavitha |
ఆర్మూర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం..  4 తులాల బంగారంతో పాటు లక్ష 80 వేల నగదు అపహరణ
X

దిశ ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రం పరిధిలోగల మామిడిపల్లిలోని తిరుమల కాలనీలో నివాసముండే మహేష్ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళితే..

బాధితుడి మహేష్ తల్లి ఆరోగ్యం బాగా లేనందున చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. అలా చికిత్స కోసం వెళ్లిన మహేష్ కుటుంబం.. తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో ఉన్న సొత్తు 4 తులాల బంగారంతో పాటు 1 లక్ష 80 వేల రూపాయలను గుర్తు తెలియని దుండగులు అపహరించుకు వెళ్ళినట్లు బాధ్యత కుటుంబ సభ్యులు వాపోయారు. బాధ్యత కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చిన్నయ్య వచ్చి చోరీకి పాల్పడిన ఇంటిని పరిసరాలను పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం బృంద సభ్యులు వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుడు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని డిటిడిసి కొరియర్‌లో పనిచేస్తున్నట్లు చెప్పాడు. ఆ కొరియర్ కు సంబంధించిన ఒక లక్ష 80 వేల రూపాయలు బ్యాంకులో జమ చేయాల్సి ఉండగా మా అమ్మకు వైద్యం చేయించేందుకు హైదరాబాద్ వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బంగారంతో పాటు ఈ నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లారని బాధితుడు వాపోయాడు.

బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కానీ ఆర్మూర్ ప్రాంతంలో ఎలాంటి ప్రమాద గంటికలు నేర సంఘటనలు జరగడం లేదన్న భ్రమలో ప్రజలని ఉంచేందుకు కనీస సమాచారం సైతం ఆర్మూర్ పోలీసులు ఇవ్వకపోవడం పట్ల ఆర్మూర్ జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చోరీలు ప్రమాదాలు జరిగిన కూడా పట్టించుకోవడం లేదని ఆర్మూర్ ప్రాంత ప్రజలు పోలీసుల తీరును విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story