- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KR Suresh Reddy : 8 నెలలు గడుస్తున్నా కానరాని పసుపు బోర్డు..
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలో 8 నెలల కిందట దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని.. ప్రధానమంత్రి చెప్పి ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు పై అతి లేదు.. గతి లేదని.. బీఆర్ఎస్ సభాపక్ష నేత కేఆర్.సురేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత కేఆర్. సురేష్ రెడ్డి మాట్లాడారు. నిజామాబాద్ పసుపు బోర్డు పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి 8 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతను కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదన్నారు.
కమ్మరపల్లిలో పసుపు రీసెర్చ్ సెంటర్ ఉందని, ఇక్కడే పసుపు బోర్డు కూడా కమ్మరపల్లిలో ఏర్పాటు చేయాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ బడ్జెట్ మొత్తం వ్యవసాయానికి ఖర్చుచేయాలి అన్నారు. రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయం కోసం కేటాయించిన బడ్జెట్ రైతులకే వినియోగించాలన్నారు. రైతులకు అన్ని విధాలుగా కేంద్రప్రభుత్వం అండగా ఉండాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందినట్లు చెప్పారు. వ్యవసాయ బడ్జెట్ మొత్తం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి శివరాజ్ షింగ్ చౌహాన్ ని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.