- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం: బీజేపీ
దిశ, నవీపేట్: రెంజల్ తాసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అయినా రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ ప్రజా ప్రతినిధులు తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మ్యాక సంతోష్ పాల్గొని మాట్లాడుతూ.. తాసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో సర్వే నెంబర్ 340లో ప్రభుత్వ భూమి ఉంది. దీనిని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ కబ్జాను అధికారులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని జిల్లా సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. అయినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా టీఆర్ఎస్ నాయకులకు వంతపాడుతున్నడని విమర్శించారు. ప్రభుత్వ భూమిలో వేసిన రేకుల షెడ్డును తొలగించి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తాసీల్దార్ రామచందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ సంతోష్, ఎంపీపీ రజని కిషోర్, వైస్ ఎంపీపీ యోగేష్, పార్టీ ప్రెసిడెంట్ సుక్కు రాజు, ఎంపీటీసీ స్వప్న రామచందర్, నాయకులు పోచయ్య, ఐటీసెల్ సాయినాథ్, రవి, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.