జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలు

by Sridhar Babu |
జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలు
X

దిశ , నిజామాబాద్ క్రైం : ముగ్గురు యువకులు ఓ ముఠాగా ఏర్పడి బైక్ దొంగతనాలు చేసి ఆ డబ్బులతో జల్సాలు చేస్తుండగా వారిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్, అడిషనల్ పోలీస్ కమిషనర్ జయరాం ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్, వారి సిబ్బంది నలుగురు బైక్ దొంగలను పట్టుకొని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే మూడో పట్టణ ఎస్ఐ ప్రవీణ్ , సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు చంద్రశేఖర్ కాలనీ బైపాస్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు షేక్ మాజీద్, మహమ్మద్ అమన్, షేక్ సాజిద్ రెండు ద్విచక్ర వాహనాలను వదిలి పారిపోతుండగా పోలీసులు వెంబడించి వారిని పట్టుకుని విచారించారు.

మొత్తం తొమ్మిది ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి వాటిని షేక్ ఫైజల్లా అనే జల్లపల్లికి చెందిన వ్యక్తికి నాలుగు ద్విచక్ర వాహనాలు విక్రయించారు. అలాగే ధర్మాబాద్, బైంసాకు చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం చోరీలు చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. వీరు నిజామాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని కోటగిరి, మహారాష్ట్రలోని ధర్మాబాద్, ఇతర ప్రాంతాలలో అమ్మి వాటి ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేసేవారు. బైక్​లు కొనుగోలు చేసిన షేక్ ఫైజల్లా ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచారు. ద్విచక్ర వాహన దొంగలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన మూడో పట్టణ ఎస్సై ప్రవీణ్ , సిబ్బంది షౌకత్ అలీ, చామీంద్, అప్సర్ లను నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ అభినందించారు.

Advertisement

Next Story