- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెరుగైన విద్యా బోధన అందించాలి
దిశ ,ఆర్మూర్ : విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించడంతో పాటు మెరుగైన విద్యను బోధించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ లోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ సందర్శించి పాఠశాలల్లోని అన్ని ఏరియాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొదట విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని రిజిస్టర్లను తనిఖీ చేసి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అడిగి వారీ సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కి సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాల ఏరియాలో శానిటేషన్ కి సంబంధించిన పని ఉందని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పంపించాలని కమిషనర్ ను ప్రిన్సిపల్ కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారిని గంగామణి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు.