ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

by Sumithra |
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
X

దిశ, భిక్కనూరు : సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. తంగేడు, గునుగు పువ్వుతో పాటు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను తయారు చేసారు. సాయంత్రం మండల కేంద్రమైన భిక్కనూరుతో పాటు వివిధ గ్రామాల్లో మహిళలు ప్రధాన కూడళ్లలో పేర్చిన బతుకమ్మలను పెట్టి వలయాకారంగా తిరుగుతూ బతుకమ్మ ఆడారు.

చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మ ఆడిన అనంతరం సమీపంలోని చెరువు కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సద్దుల బతుకమ్మను డీసీసీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి నెత్తి పైన ఎత్తుకొని సమీపంలోని చెరువు వరకు మోశారు. సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని అన్ని చెరువు కుంటల వద్ద ధగధగ మెరిసే విద్యుత్తు కాంతులను అమర్చారు.





Advertisement

Next Story

Most Viewed