అధికారులతో స్పీకర్ సమీక్ష సమావేశం.. ఏం మాట్లాడారంటే

by Sumithra |
అధికారులతో స్పీకర్ సమీక్ష సమావేశం.. ఏం మాట్లాడారంటే
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ పనుల తీరును అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం సమీక్షించారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో రెండు పడక గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించిందన్నారు.

నియోజకవర్గానికి పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరైనట్టు తెలిపారు. ఇప్పటికే 5వేల ఇళ్ళ నిర్మాణం పూర్తయిందని, మిగతా ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. త్వరలోనే కాంట్రాక్టర్లు, లబ్ధిదారులకు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు అందజేస్తామని హామీ ఇచ్చారు. సమీక్షలో అధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story