వారు చెప్పిందే రేటు.. వ్యాపారుల కనుసన్నల్లో ఆమ్ చూర్ అమ్మకాలు

by samatah |
వారు చెప్పిందే రేటు.. వ్యాపారుల కనుసన్నల్లో ఆమ్ చూర్ అమ్మకాలు
X

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ఉత్తర తెలంగాణలో అతి పెద్ద మార్కెట్ గా పేరు గడించింది. ముఖ్యంగా పసుపు అమ్మకాలకు ఈ మార్కెట్ ప్రసిద్ధిగాంచగా తెలంగాణలో ఆమ్ చూర్ క్రయవిక్రయాలు జరిగే మార్కెట్ గా ఇందూరుకు పేరుంది. పసుపు, ఇతర నిత్యావసర సరుకుల క్రయవిక్రయాలు ఈ-నామ్, ఆన్ లైన్ ద్వారా జరుగుతుండగా ఆమ్ చూర్ మాత్రం స్థానికంగా ఉండే నలుగురు వ్యాపారులు కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నారు. ధర మొత్తం నిర్ణయించేది ఆ నలుగురే. రెండు సంవత్సరాల క్రితం వరకు ముగ్గురు వ్యాపా రులు ఉండగా కొత్తగా మరొకరు చేరడంతో నలుగురు వ్యాపారుల కనుసన్నల్లోనే ఆమ్ చూర్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ లో గడిచిన ఏప్రిల్ నుంచి జూన్ వరకు మాత్రమే ఆమ్ చూర్ క్రయవిక్రయాలు జరుగుతాయి. ప్రధానంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆ నలుగురు వ్యాపారులు చెప్పిన ధరే కొనసాగుతోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర భారత దేశానికి చెందిన ప్రజలు ఆమ్ చూర్ ను చాట్ మసాలా, చికెన్ మసాలా, డ్రై ఆమ్ చూర్ గా వారు తినే ఆహారంలో తీసుకుంటారు. కానీ అది రూపొందేది మాత్రం తెలంగాణలోనే. మామిడికాయలు కోసి వాటిని పొట్టు తీసి ఎం డబెట్టి విక్రయించడం గత కొన్ని సంవత్సరాలు గా కొనసాగుతుంది. కానీ తెలంగాణలో దానికి మార్కెట్ మాత్రం నిజామాబాద్ వ్యవసాయ మార్కెటే. ప్రతి యేడాది ఎండ కాలంలో ముఖ్యంగా మే, జూన్ మాసంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో వాటిని కొనుగోలు అమ్మకాల వ్యాపారం జోరుగా సాగుతుంది. యేడాదిలో క్వింటాల్ కు ధర వేలల్లో ఉంటుంది. గడిచిన యేడాది లాక్ డౌన్ లో రూ.20 వేలు పలికిన ఆమ్ చూర్ ధర ప్రస్తుతం రూ.29,700కు క్వింటాల్ పలుకుతుంది. మార్కెట్లో మోడల్ ధరగా రూ.19,900 కొనసాగుతుంది. రూ.12,600 వేల క్వింటాల్ తో ప్రారంభమయ్యే ఆమ్ చూర్ ధర నాణ్యమైనది అతి ఎక్కువ ధరకు పలుకడం విశేషం. ఎండిన తేమ అధిక శాతం ఉన్న వాటికి మాత్రమే మార్కెట్లో అత్యధిక ధరను నిర్ణయిస్తారు. లేకపో తే అగువసగ్వకు కొంటున్నారు.

తెలంగాణలో మామిడి పంట పండించి ఆమ్ చూర్ గా విక్రయాలు జరిపే జిల్లాలుగా మెదక్, నారాయణఖేడ్, సంగారెడ్డి, జగిత్యాల, మహబూబ్ నగర్ జిల్లాలకు పేరుంది. ఆయా జిల్లాల్లో ఆమ్ చూర్ క్రయవిక్రయాలు జరుగవు. ఉత్తర భారతంతో సంబంధం ఉన్న వ్యాపారులు, రో డ్డు, రైలు మార్గం ఉన్ననిజామాబాద్ లోనే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఆమ్ చూర్ విక్రయాలు నిజామాబాద్ నుంచే కొనసాగుతున్నాయి. నాణ్యతను బట్టి క్వింటాల్ కు రూ.5వేల నుంచి ధర పలుకుతుంది. అత్యధికంగా రూ.20వేల వరకు పలుక డం గత కొన్నిరోజులుగా కొంత సరుకును వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే మార్కెట్లో ఆమ్ చూర్ నిర్ణీత ధరకు అమ్మాలని ఎలాంటి ప్రామాణికాలు లేకపోవడంతో వ్యాపా రులు చెప్పిన ధరకు అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రైతులు నిండా మునుగుతుండగా వ్యాపారులు మాత్రం లాభాలు గడిస్తున్నారు. గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ఆమ్ చూర్ విక్రయాలు జరుగలేదు. ఈ సీజన్ లో మామిడి పంట ఎక్కువగా దిగుబడి వచ్చింది. సహజంగానే మార్కెట్ కు ఇతర జిల్లాల నుంచి ఆమ్ చూర్ విక్రయాల కొరకు రైతులు ఆసక్తిగా వస్తున్నారు. ఈ నెల 11న ఆమ్ చూర్ ధర మోడల్ ధరగా రూ.19,800 ప్రకటించిన రూ.5 వేల ధర నుంచి కొనుగోలు చేసి అత్యధికంగా రూ.26,4 00కు కొనుగోలు చేశారు. శుక్రవారం 175 క్వింటాళ్ల ఆమ్ చూర్ వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. వ్యవసాయ మార్కెట్లో ఆమ్ చూర్ కు మోడల్ ధర రూ.19,900 కాగా అత్యల్పం గా రూ.7,800 క్వింటాల్ కు కొనుగోలు చేశారు. అత్యధిక ధర రూ.29,7 00గా పలికిం ది. శుక్రవారం 280 క్వింటాళ్ల ఆమ్ చూర్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.

Advertisement

Next Story