- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమతులు లేని అక్షర ది ప్లాంట్ కార్పొరేట్ స్కూల్ సీజ్ చేయాలి : ఎఐపీఎస్ యూ నాయకులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని సెయింట్ థెరీసా పాఠశాలలో అక్షరప్లాంట్ అనే హైదరాబాద్ కు చెందిన కార్పొరేట్ పాఠశాల అనుమతులు లేకుండా అడ్మిషన్ లు తీసుకుంటుందని దానిని సీజ్ చేయాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అక్షర ప్లాంట్ కార్పొరేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా కమిటీ నాయకులు ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధానకార్యదర్శి జ్వాల మాట్లాడుతూ సెంట్ తెరిసా పాఠశాల యాజమాన్యం గతంలో నారాయణ పాఠశాలకు ఆశ్రయం కల్పించిందని తెలిపారు.
ఆ విషయంలో విద్యార్థి సంఘాలు పోరాడాయని ఆ పాఠశాల గుర్తింపును ఆరోజు రద్దు చేస్తే మళ్లీ సెయింట్ థెరీసా యాజమాన్యం ఆర్జెడీ నుంచి అనుమతులు తెచ్చుకుందన్నారు. 2023- 24 విద్యా సంవత్సరానికి ఓపెనింగ్ పర్మిషన్లు ఇస్తే మళ్లీ ఇప్పుడు సెంట్ తెరిసా పాఠశాల యాజమాన్యం హైదరాబాద్ కు చెందిన అక్షర ది ప్లాంట్ స్కూలుకు ఆశ్రయమిచ్చి అడ్మిషన్లకు తీసుకుంటున్నారన్నారు. దీనిపై చర్యలు తీసుకొని సెంట్ తెరిసా గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఆ పాఠశాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని, అనుమతి రద్దుచేయని పక్షంలో ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిత్విక్, అనిల్, నాగరాజు, మహేష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.