మొత్తం అవినీతిని బయటకు తీస్తాం.. సీఎం కేసీఆర్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్

by srinivas |   ( Updated:2023-10-20 16:43:42.0  )
మొత్తం అవినీతిని బయటకు తీస్తాం.. సీఎం కేసీఆర్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తాము అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ చేసిన అవినీతిని బయటకు తీస్తామని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆయన కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌పై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఓ కుటుంబం చేతిలో బందీ అయిందని చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతి చేసింది కేసీఆరేనని ఆరోపించారు. కానీ ఇప్పటివరకూ కేసీఆర్‌పై ఒక్క విచారణ కూడా జరగలేదన్నారు. విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టించే మోదీ, అమిత్ షా.. సీఎం కేసీఆర్‌ను ఏమీ చేయరని చెప్పారు. తనపై 24 కేసులు ఉన్నాయని, తెలంగాణ ముఖ్యమంత్రిపై ఎన్ని కేసులున్నాయో చెప్పాలన్నారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు.బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని చెప్పారు. కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే చోట మజ్లిస్ పార్టీని రంగంలోకి దించుతోందని రాహుల్ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారు. తెలంగాణతో తమకు కుటుంబ అనుంబంధం ఉందని చెప్పారు.

‘పసుపు బోర్డు విషయంలో ప్రధాని మోదీ మాట తప్పారు. ప్రధాని మోదీ మాటలకు విలువ లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ. ఆర్మూరులో పసుపు పంటను ఎక్కువగా సాగు చేస్తారు. రైతులకు ఎన్ని డబ్బులు ఇచ్చినా తక్కువే. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు అవసరం వచ్చినా కాంగ్రెస్ అండగా నిలిచింది. ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తాం. పెన్షన్ రూ. 4 వేలు అందిస్తాం. ’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed