- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా బంగారం మాకు కావాలి.. మహిళల ఆందోళన..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. గడిచిన వారం రోజుల్లో బాధితులు రెండోసారి నిరసనకు దిగారు. బ్యాంక్ లో బంగారంపై రుణాలు తీసుకున్న వారు, లాకర్లలో బంగారం దాచుకున్న వారు, తమ బంగారాన్ని తరుగు లేకుండా ఇవ్వాలని ఆందోళనకు దిగారు. మూడు నెలల క్రితం బ్యాంక్ లో దొంగలు పడి 8 కిలోల బంగారంతో లక్షల నగదును చోరి చేశారు. ఇటీవల బ్యాంక్ అధికారులు బాధితులతో తరుగు కోత విధించి బంగారం ఇస్తామని సెటిల్ మెంట్ కు ముందుకు వచ్చారు.
అయితే బ్యాంక్ నిబంధనలు అక్కర్లేదని, తాము ఎంత బంగారం తాకట్టు పెట్టామో, లాకర్లలో దాచుకున్నామో అంతే బంగారాన్ని ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఏకంగా బ్యాంక్ ముందు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు బ్యాంక్ మేనేజర్ ను రప్పించి వారిని సముదాయించిన వినలేదు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన బ్యాంక్ మేనేజర్ ను బాధితులు నిలదీశారు. బ్యాంక్ ఉన్నతాధికారులతో మరోసారి చర్చలు జరిపి బాధితులకు బంగారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.