ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి : జిల్లా అదనపు కలెక్టర్

by Sumithra |
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి : జిల్లా అదనపు కలెక్టర్
X

దిశ, కామారెడ్డి రూరల్ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. మొత్తం 64 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఆర్ డీఓ సాయన్న, పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, వివిధ శాఖల జిల్లాఅధికారులు పాల్గొన్నారు. కాగా రెవెన్యూకు సంబంధించి 48, డీపీఓకు సంబంధించి అయిదు, విద్యుత్ శాఖకు ఒకటి, ఎక్సైజ్ శాఖకు ఒకటి, మత్స్య శాఖకు ఒకటి, మున్సిపల్ కు రెండు, డీఆర్డీఓకు నాలుగు, ఎస్సీ కార్పొరేషన్ కి ఒకటి, ఎస్పీ ఆఫీసుకు ఒకటి చొప్పున మొత్తం 64 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed