- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి..
దిశ, నిజామాబాద్ సిటీ : గల్ఫ్ లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన షేఖ్ బషీర్ పై చర్యలు తీసుకోవాలని ప్రవాస భారతీయుల హక్కుల, సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయకుడు అన్నారు. మంగళవారం జిల్లాకలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేసి, కలెక్టరేట్ ఎదుట బాధితులతో పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడపల్లి మండలం ఎంఎస్ ఫారంకు చెందిన షేఖ్ బషీర్ అనే వ్యక్తి డిచ్పల్లిలో ఆర్కే ట్రావెల్స్ పేరుతో ఆఫీసుపెట్టి వందలాది మంది నుంచి 25 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేసి పరారీ అయ్యాడని అన్నారు.
అతని పై డిచ్పల్లి పీఎస్ లో, ఎడపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసినప్పటికీ నెలరోజులు గడిస్తున్నా పట్టించుకోవడం లేదని సీపీ దృష్టికి తీసుకెళ్లనా ప్రయోజనం లేదని అన్నారు. గల్ఫ్ బాధితులను ఇబ్బందులు గురిచేసిన బషీర్ పై చర్యలు తీసుకొని వెంటనే న్యాయం చేయాలని కోరారు. ధర్నాలో పాత్కురి తిరుపతిరెడ్డి, ఇందల్ వాయు కిషన్, ఇబ్రహీం, ఇమ్రాన్, పెద్ద గంగారాం, సాయినాథ్, లక్ష్మణ్, సాయి కుమార్ పాల్గొన్నారు.