శాంతినికేతన్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

by Sridhar Babu |
శాంతినికేతన్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న శాంతినికేతన్ పాఠశాలలో ఎలాంటి అనుమతి లేకుండానే వసతి గృహాన్ని నడుపుతున్నారని, జేఈఈ, ఐఐటీ తదితర తరగతులు నడుపుతున్న శాంతినికేతన్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు భారతీయ విద్యార్థి మోర్చా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చ

జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల బుల్లెట్ చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మాట్లాడుతూ...శాంతినికేతన్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా జేఈఈ, ఐఐటీ తదితర పేర్లతో విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫీజులను నిర్ణయించే (గవర్నింగ్ బాడీ) కమిటీ లేకుండానే ఇష్టానుసారంగా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకాకుండా విద్యను వ్యాపారం చేస్తున్న శాంతినికేతన్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed