కనిపించిన ఆరుద్ర.. రైతుల్లో ఆనందం

by Mahesh |
కనిపించిన ఆరుద్ర.. రైతుల్లో ఆనందం
X

దిశ, ఏర్గట్ల : పొలాల్లో ఆరుద్ర పురుగులు వచ్చేస్తున్నాయంటే రైతులకు ఆనందంగా ఉంటుంది. ఆరుద్ర కార్తె లో మాత్రమే కనిపించే అరుదైన పురుగు, అన్నదాతకు నేస్తం ఆరుద్ర తొలకరి జల్లులు మట్టిని తాకిన వేళ పుడమి తల్లికి కుంకుమ దిద్దినట్లు పొలాల్లో, తోటల్లో దర్శన భాగ్యాన్ని కలిగించింది. వీటిని చూడటం రైతులు వర్షాలకు శుభసూచకంగా భావిస్తారు. ఆరుద్ర కార్తెలో మాత్రమే దర్శనమిచ్చే అపురూప అతిథిగా ఎరువు మక్మల్ మెరుపుతో సున్నితంగా ఉంటాయి. ముట్టుకుంటే ముడుచుకుంటాయి. ఏరువాక సమయంలో కుప్పలు కుప్పలుగా వచ్చేవి గర్భిణీలు తింటే ఎర్రటి పండంటి బిడ్డ పుడుతుందని నమ్ముతారు. దశాబ్ద కాలంగా పెస్టిసైడ్స్, ఎరువుల వాడకం తో ఆరుద్ర జాతి అంతరిస్తోంది. ఈ అతి సుందర జీవిని పురుగు అనాలనిపించదు. ఆరుద్ర కార్తెలో మాత్రమే పలకరించే ఆత్మీయ మిత్రమా నేస్తమా స్వాగతం అంటున్నారు రైతులు.

యువ రైతు పోతుకూరి మహేష్ రెడ్డి

వ్యవసాయం మొదలు పెట్టడానికి ఆరుద్ర కార్తె అనుకూలమైనది. ఈ కార్తె లో మాత్రమే ఆరుద్ర పురుగు కనిపిస్తుంది. ఆరుద్ర పురుగులు కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు బాగా ఉంటాయని రైతులు నమ్ముతారు. దీనిని కొన్ని ప్రాంతాల్లో కుంకుమ పురుగు అని కూడా పిలుస్తారు. ఇవి సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యేకంగా ఈ ఆరుద్ర కార్తె లో మాత్రమే కనిపిస్తాయి. అందుకే వీటిని ఆరుద్ర పురుగులు అంటారు. ఇవి పంటలకు ఎటువంటి నష్టం చేయవు. ఏడాదికి ఒకసారి ప్రత్యక్షమయ్యే ఈ పురుగులను చూడటం రైతులు శుభసూచకంగా భావిస్తారు.

Next Story