Blood Art : బ్లడ్ ఆర్ట్ తో గీసిన చిత్రపటం ఎమ్మెల్యేకు బహుకరణ..

by Sumithra |
Blood Art : బ్లడ్ ఆర్ట్ తో గీసిన చిత్రపటం ఎమ్మెల్యేకు బహుకరణ..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : ఎమ్మెల్యే పై ఉన్న ప్రేమాభిమానాలతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన సొంత రక్తంతో బ్లడ్ ఆర్టిస్ట్ తో ఎమ్మెల్యే చిత్రపటం గీయించి ఎమ్మెల్యేకు బహుకరించారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులాం హుస్సేన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పై తనకున్న అత్యంత ప్రేమాభిమానాలతో గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జన్మదినం సందర్భంగా తన సొంత రక్తంతో గీయించిన ఎమ్మెల్యే చిత్రపటాన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మదన్ మోహన్ రావుకు గులాము హుస్సేన్ బహుకరించాడు.

ఈ సందర్భంగా గులాం హుస్సేన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పై ఉన్న ప్రేమాభిమానాలతో మదన్ మోహన్ రావు జన్మదినం సందర్భంగా తన సొంత రక్తాన్ని బ్లడ్ ఆర్టిస్ట్ కు ఇచ్చి ఎమ్మెల్యే చిత్రపటాన్ని గీయించి బహుకరించినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎంతో కృషి చేస్తున్నాడని, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story