ఉమ్మడి సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

by Shiva |
ఉమ్మడి సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
X

దిశ, నిజాంసాగర్ : ఫారెస్ట్, రెవెన్యూ భూములను ఉమ్మడి సర్వే నిర్వహించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నిజాంసాగర్ మండల తహసీల్దార్ నారాయణ ను ఆదేశించారు. మండల పరిధిలోని మల్లూరు గ్రామ శివారులోని 765 (ఏ) లో గల 700 ఎకరాల భూమిని ఫారెస్ట్, రెవెన్యూ ఉమ్మడి సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశించారు. 700 ఎకరాల్లో 158 ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తున్నారని తహసీల్దార్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వారం రోజుల్లో 700 ఎకరాల్లో పూర్తి సర్వే నిర్వహించాలని తహసీల్దార్ నారాయణ కు ఆదేశించారు.

Advertisement

Next Story