నడవలేని స్థితిలో సునీతా విలియమ్స్ (వీడియో)

by Mahesh |   ( Updated:2025-03-19 15:12:20.0  )
నడవలేని స్థితిలో సునీతా విలియమ్స్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్(Sunita Williams) , బచ్‌ విల్మోర్ (Butch Wilmore) 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం జూన్ నెలలో ఓ మిషన్ పనిలో స్టార్‌లైన్ క్యాప్సుల్‌లో ఐఎస్ఎస్‌కు వెళ్లారు. అయితే వారు వెళ్లిన స్టార్‌లైన్ క్యాప్సుల్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో సునీత విలియమ్స్ పాటు మరొకరు భూమి మీదకు తిరిగి రాలేకపోయారు. దాదాపు 9 నెలల పాటు వారు అక్కడే చిక్కుకొని పోయారు. అయితే వారిని భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌.. భారత కాలమానం ప్రకారం ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది.

ఈ ల్యాండింగ్ అనంతరం క్యూ డ్రాగన్ క్యాప్సుల్ (Q Dragon Capsule) నంచి సునీతా విలియమ్స్ బయటకు వచ్చే క్రమంలో నడవలేని స్థితి (Unable to walk)లో కనిపించారు. సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలోని ఐఎస్ఎస్‌లో ఉన్నందున ఆమె శరీరం నేలపై నడవలేక పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను రికవరీ సిబ్బంది స్పెషల్ వీల్ చైర్ (Special wheelchair) పై తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో క్యాప్సూల్ నుంచి బయటకు వస్తున్న సునీత విలియమ్స్ నడవలేని స్థితిలో ఉండటం స్పష్టంగా కనిపించింది. అయితే దీర్ఘకాలికంగా అంతరిక్షంలో ఉండటం వల్ల అస్ట్రోనాట్‌లకు అనేక సమస్యలు తలెత్తడం సహజం గానే జరుగుతాయి. దీంతో ఆమె తన నడకను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది.

Read More..

Sunita Williams: వావ్‌.. సునీతకు డాల్ఫిన్లు ఎలా వెల్కమ్‌ చెప్పాయో చూడండి!

Next Story

Most Viewed