ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 823 విద్యార్థులు గైర్హాజరు..

by Sumithra |
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 823 విద్యార్థులు గైర్హాజరు..
X

దిశ, నిజామాబాద్ సిటీ : శుక్రవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 823 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్ విద్యాఅధికారి రఘురాజ్ తెలిపారు. మొత్తం 96.4 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 18,455 మంది విద్యార్థులకు గాను 17,632 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. వీరిలో జనరల్ 15,933 మందికి గాను 15,365 మంది హాజరుకాగా 568 మంది విద్యార్థులు గైర్ హాజర్ అయినట్లు తెలిపారు. అలాగే ఒకేషనల్ 2,522 మంది విద్యార్థులకు గాను 2,267 మంది విద్యార్థులు హాజరు కాగా 255 మంది విద్యార్థులు గైర్ హాజరు అయినట్లు తెలిపారు. డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ప్రశ్నపత్రాలు నిలువచేసిన నిక్షిప్త కేంద్రాన్ని జిల్లా ఇంటర్ విద్యాఅధికారి శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ నుండి ఐదు పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాల ప్యాకెట్ల పంపిణీ చేసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.

అక్కడ ఏర్పాట్లను చూసి జిల్లా ఇంటర్ విద్యాధికారి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ అధికారి సీ.సీ. కెమెరాల ముందు మాత్రమే ప్రశ్నాపత్రాల ప్యాకెట్లను విప్పాలని ఆదేశించారు. డిచ్ పల్లి పోలీస్ స్టేషన్లో ప్రశ్నపత్రాల మూడు సెట్ల నిక్షిప్తము, పంపిణీ ప్రక్రియ గురించి కస్టోడియన్ లు శ్యాం, భాస్కర్ లను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే డిచ్ పల్లి మోడల్ స్కూల్ కళాశాలను, మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను, డిచ్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను, ధర్పల్లి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను, ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి సమీక్షించారు. డిచ్ పల్లి మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షావిధానాన్ని, ఫైల్ లను పరిశీలించారు. విద్యార్థుల గైర్హాజరు వివరాలను ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరీక్షల నిర్వహణ కమిటీని సంప్రదించాలని ఆదేశించారు.

జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, చిన్నయ్య, శ్రీమతి కనకమహాలక్ష్మిలు 12 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించగా, హై పవర్ కమిటీ రజీయుద్దీన్ 7 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 8 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 28 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించారని జిల్లా ఇంటర్ విద్యాఅధికారి తెలిపారు.

Advertisement

Next Story