ఎస్బీఐ వినియోగదారుల సేవా కేంద్రంలో 26 లక్షల గోల్మాల్..

by Sumithra |
ఎస్బీఐ వినియోగదారుల సేవా కేంద్రంలో 26 లక్షల గోల్మాల్..
X

దిశ, నిజాంసాగర్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజాంసాగర్ శాఖ అనుబంధ సేవా కేంద్రంలో భారీగా అవినీతి జరిగింది. నిజాంసాగర్ ఎస్బీఐ బ్యాంకు ప్రక్కనే ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్ మినీ బ్యాంకులో 11 డాక్రా మహిళ సంఘాల పొదుపు సొమ్ము 26 లక్షల రూపాయలు ఖాతాల్లో జమ చేయకుండా, స్వాంతానికి వాడుకున్నట్లు ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ విలేకరులతో తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని హసన్పల్లి గ్రామనికి చెందిన 11 డ్వాక్రా సంఘాలు 26 లక్షల రూపాయలను కస్టమర్ సర్వీస్ సెంటర్ నిర్వాహకురాలు కల్పనకు విడుతల వారీగా అందించారు. బ్యాంకు రుణాలు, పొదుపు ఖాతాల్లో డబ్బులు వెయ్యకుండా, మ్యానువల్ రిసిప్ట్ ఇచ్చేదని మహిళలు పోలీసుల ఫిర్యాదు లో తెలిపారు. 2021-2022 సంవత్సరాలో కస్టమర్ సర్వీస్ సెంటర్ లో జమ చేసిన 26 లక్షల మొత్తాన్ని నిర్వాహకురాలైన కల్పన తన అవసరాలకు వాడుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రుణాలు చెల్లించడం లేదని బ్యాంకు సిబ్బంది డ్వాక్రా సంఘాలకు తెలపడంతో ఈ తతంగం బయటపడింది. దీనిపై హాసన్ పల్లి డ్వాక్రా సంఘాలు పలుమార్లు కస్టమర్ సర్వీస్ సెంటర్ నిర్వాహకురాలు కల్పనతో గొడవకు దిగారు తను వాడుకున్న సొమ్మును తిరిగి చెల్లిస్తానని పలుమార్లు హామీ ఇచ్చిందని వారు అన్నారు. ఇంతకు డబ్బులు తిరిగి చెల్లించక పోవడంతో సోమవారం సాయంత్రం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో డ్వాక్రా మహిళలు ఫిర్యాదు చేశారు. ఒక్క హసన్ పల్లి గ్రామంలోనే 36 లక్షల ఫ్రాడింగ్ జరిగినట్లు, అందులో పది లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలిసింది. దీనిపై ఐకెపి ఎపిఎం రామ్ నారాయణ గౌడ్ ను వివరణ కోరగా ఫ్రాడింగ్ జరిగింది వాస్తవమే అని పలుమార్లు డబ్బులు చెల్లించాలని కోరిన డబ్బులు చెల్లించక పోవడంతో ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

అసలు తప్పెవరిది?

వినియోగదారుల సేవా కేంద్రాల్లో పొదుపులు, రుణాలు చెల్లించాలని బ్యాంకు సిబ్బంది బలవంతంగా డ్వాక్రా సంఘాలను పంపేవారు. కస్టమర్ సర్వీస్ సెంటర్ లో జరిగే ప్రతి ట్రాన్జంక్షన్ ను బ్యాంకు సిబ్బందికి తెలిసే ఉంటుంది. మహిళా సంఘాల ఖాతాల్లో ప్రతి నెల పొదుపు జమ చేయడానికి ఐకెపి, సి ఎ, సీసీలు, ప్రయత్నిస్తారు, సిఏ, సీసీలకు తెలియకుండా సంవత్సర కాలం పాటు ఖాతాల్లో డబ్బులు జమ అవుతుందా లేదా అనే విషయం తెలియక పోదు? రుణాలు సకాలంలో చెల్లించని డ్వాక్రా సంఘాలకు సీసీల ద్వారా బ్యాంకు సిబ్బంది తెలియజేస్తారు, మరి సిఏ, సీసీలు, బ్యాంకు సిబ్బందికి తెలియకుండా ఈ అవినీతి జరిగి ఉంటుందా? గతంలో పలుమార్లు కల్పనపై అవినీతి నిరోపణ కావడంతో కస్టమర్ సర్వీస్ సెంటర్ ను ముయించడం జరిగింది.

అచ్చంపేట కస్టమర్ సర్వీస్ సెంటర్లో సైతం అవినీతి జరగడంతో ఆ సెంటర్ ను సైతం మూయించారు. అచ్చంపేట ,బంజపల్లి కస్టమర్ సర్వీస్ లలో అవినీతి జరిగిన ఇప్పటివరకు శాఖపరమైన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేసి డ్వాక్రా మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. వీరితో హసన్ పల్లి గ్రామ సర్పంచ్ మోతుకుల సంగమేశ్వర్ గౌడ్, కె. గుండయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed