- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాస్టల్ అడ్మిషన్స్ సమస్య.. నిజాం కాలేజీ యాజమాన్యం కీలక ఉత్తర్వులు
దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్న సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులు హాస్టల్ వసతి కావాలనుకుంటే ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీచేశారు. 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే విద్యార్థులకు మాత్రమే హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుకు SSC, ఇంటర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ మార్కుల జాబితాతో పాటు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జతచేయాల్సి ఉంటుందన్నారు. రెగ్యులర్ విద్యార్థులకు మాత్రమే హాస్టల వసతి ఉంటుందని స్పష్టంచేశారు. 17వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫైనల్ లిస్టును ఈనెల 19వ తేదీన విడుదల చేస్తామని నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.8 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. బీసీ విద్యార్థులకు రూ.9 వేలు, ఓసీ కేటగిరీ విద్యార్థులకు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.160 చెల్లించాల్సిందిగా తెలిపారు. ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా హాస్టల్ వసతి కల్పించాలని నిజాం కాలేజీ విద్యార్థులు ధర్నా, నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రభుత్వం దిగి వచ్చి యూజీ, పీజీ విద్యార్థులకు 50-50గా వసతి కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయినా విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై విద్యార్థులు ఎలా స్పందింస్తారనేది వేచి చూడాల్సిఉంది.
ఇవి కూడా చదవండి : పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు స్కాలర్‌షిప్.. ఏడాదికి ఎంతంటే ?