రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి..? రుణమాఫీ గైడ్ లైన్స్‌పై నిరంజన్ రెడ్డి ఫైర్

by Satheesh |
రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి..? రుణమాఫీ గైడ్ లైన్స్‌పై నిరంజన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రూ.2 లక్షల రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా సోమవారం రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) ప్రమాణికంగా పంట లోన్లు మాఫీ చేస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వం రిలీజ్ చేసిన రుణమాఫీ గైడ్ లైన్స్‌పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీకి ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) ప్రమాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిందని.. మరీ రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినవి మార్గదర్శకాలు కాదని, రైతులను మభ్యపెట్టేందుకు ప్రభుత్వ ప్రయత్నాలను మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పంట రుణాలే మాఫీ చేయనట్టు కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పారని.. ఇప్పుడు మాత్రం కొందరికే రుణమాఫీ పరిమితం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.



Next Story