- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MLCs : సీఎం రేవంత్‌తో నూతన ఎమ్మెల్సీలు భేటీ.. ఫోటోలు వైరల్

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్తగా నియామకమైన ఎమ్మెల్సీలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భేటీ అయ్యారు. శాసనమండలి సభ్యులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కోదండరామ్, ఆమెర్ అలీ ఖాన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్‌కి షాలువాతో సత్కరించి.. పూల బోకే అందించారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలను సీఎం, డిప్యూటీ సీఎం అభినందించారు.
ఈ భేటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మందుల సామేల్, రేకులపల్లి భూపతిరెడ్డి ఉన్నారు. కాగా, ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్, ఆమెర్ అలీఖాన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే వీరి నియామకంపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లడంతో వీరి నియామకం ఆగిపోయింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ అదేశాలివ్వడంతో వీరి ప్రమాణ స్వీకారం ఇటీవల జరిగింది.