మీరు గ్రేట్ సార్.. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా

by Ramesh N |   ( Updated:2024-02-10 09:33:16.0  )
మీరు గ్రేట్ సార్.. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఒకవైపు వీవీఐపీ మూవ్‌మెంట్ ఉన్నప్పటికీ తాగి ఆటో డ్రైవర్‌ను తక్షణమే ఆపించి.. ప్రజలు, డ్రైవర్ భద్రతకు ట్రాఫిక్ పోలీస్ ప్రాధాన్యత ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ఓ డ్రైవర్ డ్రింక్ చేసి ఆటో నడుపుతూ ట్రాఫిక్‌లో ఒక బైక్‌కు చిన్నగా డ్యాష్ ఇస్తాడు. అది గమనించిన ఓ బైకర్ ఆటో డ్రైవర్ వద్దకు వెళ్లి ‘తాగారా అన్న’.. అని అడుగుతారు. దీంతో ఆటో డ్రైవర్ తాగానని, ఇంటికి పోతున్నానని సమాధానం చెబుతాడు.

దీంతో ఆ బైకర్ ఆటోను రోడ్డు పక్కకు తీసుకువస్తారు. ఈ క్రమంలోనే మరో బైక్ పై వచ్చిన పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ ఆటో డ్రైవర్ వద్దకు వచ్చి వివరాలు అడిగి జాగ్రత్తలు చెప్పే విధానానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. పోలీస్ అధికారి ఆటో డ్రైవర్‌తో మర్యాదగా మాట్లాడుతూ.. ఇంట్లో వారికి ఫోన్ చేసి బండిని తీసుకెళ్లమని ఆయనకు నచ్చజెబుతారు. ఆ సమయంలోనే గవర్నర్ కాన్వాయ్ వెలుతుంది. తర్వాత గవర్నర్ కాన్వాయ్ వెళ్లిన తర్వాత డ్రైవర్ ఇంట్లో వారికి ఫోన్ చేసి పంపిస్తారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ డ్రైవర్‌తో మాట్లాడే విధానం, అతనికి నచ్చజెప్పి పంపించే విధానాకికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

Advertisement

Next Story