నీట్ 2024 భారీ స్కామ్.. టాప్ 5 కూడా తెలంగాణకు దక్కలేదు.. బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |   ( Updated:2024-06-09 05:16:05.0  )
నీట్ 2024 భారీ స్కామ్.. టాప్ 5 కూడా తెలంగాణకు దక్కలేదు.. బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ యూజీ 2024 లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎక్స్‌ వేదికగా బీజేపీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నీట్ 2024 లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించింది. పరీక్షకి ముందే పేపర్ లీక్ జరిగిందని అభిప్రాయపడింది. ఓకేసారి 67 మంది విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఓకే ఎగ్జామ్ సెంటర్‌కు చెందిన ఏడుగురికి 720/720 మార్కులు వచ్చాయని వెల్లడించింది. అదే సెంటర్లో 163 సరైన సమాధానాలు రాసిన జాన్వీ అనే విద్యార్థినికి 720/720 మార్కులు వచ్చాయని తెలిపింది.

తెలంగాణలో ఒక్కరికి కూడా టాప్ 5 ర్యాంకులు దక్కలేదని పేర్కొంది. జూన్ 14న రావలసిన ఫలితాలు జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ రోజే రావడంతో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయని అనుమానం వ్యక్తం చేసింది. బీజేపీ నీచ రాజకీయాల వల్ల ప్రతిభ గల విద్యార్థులు నష్టపోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను బీఆర్ఎస్ పోస్ట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed