- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NDSA : ‘కాళేశ్వరం’ భద్రతపై ఎన్‌డీఎస్‌ఏ కీలక భేటీ ప్రారంభం
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) కీలక సమావేశం ప్రారంభం అయింది. న్యూఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అధ్యక్షతన పలు తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం విషయంలో భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కాగా, జులై తొలివారంలోపే సాంకేతిక పరీక్షలు పూర్తి చేయాలని ఈ ఏడాది మే 5న ఇచ్చిన నివేదికలో ఎన్‌డీఎస్‌ఏ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ రెండో వారంలో కేంద్ర పభ్రుత్వ సంస్థలైన సీడబ్ల్యూపీఆర్‌ఎస్, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గోదావరిలో వరద రావడంతో ఆ పరీక్షలు నిలిచిపోయాయి. ఇవాళ్టి భేటీతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆసక్తిగా మారింది
Read More..
IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీ.. వికాస్ రాజ్‌కు కీలక పదవి