కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం

by Kalyani |
కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం
X

దిశ, కోదాడ : ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన కోదాడ డిపోకు చెందిన బస్సులో చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి కోదాడకు వెళ్తున్న బస్సులో గుడిబండ గ్రామానికి చెందిన మహిళ అలివేలు పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆర్టీసీ డ్రైవర్ స్పందించి బస్సును పక్కకు ఆపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులు ఆమెకు సహాయం చేశారు. వెంటనే 108 సిబ్బందికి కాల్ చేసి ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కోదాడ డిపో మేనేజర్ తల్లి బిడ్డ యోగ క్షేమాలు తెలుసుకొని, డిపోకు చెందిన డ్రైవర్, కండక్టర్ ను అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed