గ్రామాలకు..బస్సులు వచ్చేనా..!

by Kalyani |
గ్రామాలకు..బస్సులు వచ్చేనా..!
X

దిశ,తిరుమలగిరి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలకు పట్టణ కేంద్రాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యాల నిమిత్తం ఆర్టీసీ బస్సులు వచ్చి పోయేవి.కాలక్రమేణా అభివృద్ధిలో భాగంగా గ్రామాలకు పట్టణాలకు రోడ్ల సౌకర్యాలు ఉన్నప్పటికీ పల్లెల్లోకి బస్సు సౌకర్యాలు నిలిపివేయడంతో ప్రధాన రోడ్ల మీద వరకు ఎలాగోలాగా వచ్చి మరి పట్టణాలకు పనుల నిమిత్తం,సరుకులు తెచ్చుకోవడానికి,బతుకుదెరువు కోసం,చదువుల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని గ్రామీణ ప్రాంత ప్రజలు తమ గోడును వెలిబుచ్చుకుంటున్నారు. కరోనా వచ్చిన సంవత్సరం నుండి పల్లెల్లోకి పల్లె వెలుగు బస్సుల సేవలు చూద్దామన్న కానరావడం లేదని ఆవేదన చెందుతున్న పల్లె జనాలు.ఆటోలు ఇతర ప్రైవేటు వాహన దారులు ఇష్టానుసారంగా ఆర్థిక దోపిడీ చేస్తుపోతున్నారని ఎలాగైనా బస్సు డిపోల మేనేజర్లు మరింత ఆర్టీసీ సర్వీసులను గ్రామాలకు కేటాయించేలా ప్రజాప్రతినిధులు,నాయకులు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నారు.

ఆర్థికంగా ఉన్నవారు బైక్,కారుల మీదనో..సొంత వాహనాల మీదనో ప్రయాణిస్తున్నారు.ఎలాంటి వాహనాలు లేని సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా మళ్లీ గ్రామాలకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులను కేటాయించి ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి.మెయిన్ రోడ్డు కి వెళ్లి బస్సులెక్కి ప్రయాణించాలంటే ఎక్స్ప్రెస్ సర్వీసులతో ఒకచోట ఆపడం లేదు. మరి అధిక ధరల బాదుడు తప్పడం లేదని సగటు సామాన్య ప్రయాణికుని ఆవేదన.అభివృద్ధి అంటే ఇదేనేమో అని ముక్కున వేలు వేసుకుని వాపోతున్న పల్లె జనాలు అక్కడక్కడ ప్రజా ప్రతినిధులకు,డిపో మేనేజర్లకు గ్రామాలకు బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని వేడుకుంటూ వినతి పత్రాలు అందజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed