Office siege:నీటి గుంతలో పడిన వాటర్ మెన్..ఆతర్వాత ఏం జరిగిందంటే..?

by Naveena |
Office siege:నీటి గుంతలో పడిన వాటర్ మెన్..ఆతర్వాత ఏం జరిగిందంటే..?
X

దిశ, చండూరు : చండూరు మున్సిపాటిలో వాటర్ మెన్ గా విధులు నిర్వహిస్తూ బుధవారం రాత్రి మృతి చెందిన..మున్సిపల్ కార్మికుడు బొమ్మకంటి బిక్షమయ్య (55)కుటుంబానికి న్యాయం చేయాలని సి ఐ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరా రెడ్డి డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా,కుటుంబంలో ఒకరికి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసన విరమించేది లేదని ఆయన అన్నారు. కాగా చండూరు గ్రామపంచాయతిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు మున్సిపాలిటీలో సుమారుగా 30 సంవత్సరాలుగా నీటి వాటర్ మెన్ ఆయన పని చేశారని తెలిపారు. బుధవారం రాత్రి వాటర్ మెన్ గేట్ వాల్ తిప్పుతున్నడగా.. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మరణించారని ఆరోపించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం సి ఐ టి యు నాయకులు,బంధువులు ఆయన కుటుంబానికి న్యాయం చేసేంతవరకు అంత్యక్రియలు నిర్వహించెది లేదని, మృత దేహాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఉంచి నిరసన తెలుపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed