Minister Komati Reddy : రాష్ట్రంలోనే బెస్ట్ మెడికల్ కాలేజ్ గా నల్గొండ కాలేజ్ ని చేస్తాం

by Kalyani |
Minister Komati Reddy : రాష్ట్రంలోనే బెస్ట్ మెడికల్ కాలేజ్ గా నల్గొండ కాలేజ్ ని చేస్తాం
X

దిశ,నల్గొండ: నల్గొండ టౌన్ లో నూతన మెడికల్ కళాశాలను అధికారులతో కలిసి ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ చేశారు. అలాగే కళాశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఆగస్టు చివరి వారంలో సీఎం రేవంత్ రెడ్డితో మెడికల్ కళాశాల ప్రారంభిస్తామని తెలిపారు. నల్గొండలో విపరీతంగా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు వస్తున్నారని, ఎక్కడ కూడా క్వాలిటీలో వెనుకకు పోవద్దు అని, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీని బెస్ట్ మెడికల్ కాలేజ్ గా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేయాలి అని అధికారులకు సూచించారు. అలాగే ఆరోగ్య శ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు చేశామని తెలిపారు.

ప్రభుత్వ మెడికల్ కళాశాల సిబ్బంది, విద్యార్థులకు టౌన్ లోని ఆసుపత్రికి వెళ్లడానికి 3 బస్సులను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కొనుగోలు చేసి ఇస్తామని అన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు మంచి వైద్యం అందించేలా పని చేస్తుందని అన్నారు. మెడికల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని, అలాగే నర్సింగ్ కళాశాలకు 20 కోట్లు నిధులు విడుదల అయ్యాయని, దానిని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి తెలిపారు.ఈ రివ్యూ లో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, వైద్య కళాశాల అధికారులు, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story