రాష్ట్రంలో అభివృద్ధి కావాలా... ? అంధకారం కావాలా... ?

by Naresh |   ( Updated:2023-11-23 14:17:46.0  )
రాష్ట్రంలో అభివృద్ధి కావాలా... ? అంధకారం కావాలా... ?
X

దిశ, దేవరకొండ: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మళ్లీ రాష్ట్రం అంధకారంలోకి పోతుంది...! మీకు రాష్ట్రంలో అభివృద్ధి కావాలా...! అంధకారం రాష్ట్రం కావాలా...! అని కేటీఆర్ ప్రశ్నించారు. గురువారం దేవరకొండలో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో డిండి ఎక్స్ రోడ్ మీనాక్షి చౌరస్తా వద్ద ఆయన పాల్గొని మాట్లాడుతూ.... గత 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందని, మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మొత్తం అంధకారమయం అవుతుందని ఆయన పేర్కొన్నారు. దేవరకొండ అభివృద్ధి కోసం రవీంద్ర కుమార్ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడని ఇలాంటి మంచి వ్యక్తిని మీరు కోల్పోతే దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి పోతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రవీంద్ర కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత దేవరకొండలో అభివృద్ధి సంక్షేమంలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపాడని, మళ్లీ రవీంద్ర కుమార్‌ను గెలిపించుకున్నట్లు అయితే మీ దేవరకొండను అందాల కొండగా మార్చడానికి ఎన్ని నిధులు ఇవ్వడానికైనా వెనకాడనని ఆయన తెలిపారు. 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో నాలుగో నెంబర్ పై కారు గుర్తు మీద ఓట్లు వేసి రవీంద్ర కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.



..అలాగే డిసెంబర్ 3 తర్వాత అత్తలకు పెన్షన్ ఇచ్చినట్లే కోడళ్లకు కూడా సౌభాగ్య లక్ష్మి ద్వారా నెలకు రూ. 3 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రూ. 4 వేలు ఉన్న పెన్షన్ రూ. 5 వేలు పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎన్నికల ఇంచార్జ్ గుత్తా అమిత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, జెడ్పీటీసీలు అరుణ సురేష్ గౌడ్, మాధవరం సునీత జనార్దన్ రావు, మాధవరం దేవేందర్ రావు, నాయకులు హనుమంతు వెంకటేష్ గౌడ్, నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిల్యా నాయక్, వాడిత్య రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story