- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాధితులు ధైర్యంగా స్టేషన్లో ఫిర్యాదు చేయాలి
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : అన్యాయానికి గురి అయిన బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. శనిచారం బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని, ప్రజలతో మమేకమై పని చేయాలని సూచించారు. బాధితులు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే విధంగా పని వాతావరణం ఉండాలని సూచించారు. మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల చేతిలో హింసను, నిరాదరణ ఎదుర్కుంటూ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా రాలేని బాధితులు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ రూమ్ 8712662111 నంబర్‌కి గానీ, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, భువనగిరి ఏసీపీ రవి కిరణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.