- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్‌కు షాక్.. టీఆర్ఎస్‌కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీనామా
దిశ, నల్లగొండ: రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అహంపూరితధోరణి నచ్చకే బహుజన్ సమాజ్ పార్టీలో చేరినట్లు టీఆర్ఎస్‌కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత శివరామకృష్ణ స్పష్ఠం చేశారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలకు నిరసన ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, బీఎస్పీలో చేరారు. హైదరబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ చీప్ కోర్టినేటర్ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. శివరామ కృష్ణతో పాటు మరో 60 మంది నాయకులు బీఎస్పీలో చెరారు. ఈ సందర్భంగా శివరామ కృష్ణ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని.. రాజ్యాంగాన్ని కించపరుస్తూ మాట్లాడటాన్ని ఇక మీదట సహించేది లేదని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తాను తీవ్ర మనస్థాపానికి గురై నట్లు తెలిపారు. మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారని, దళితుడనే కారణంతోనే రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన విషయం అందరికీ తెలుసని ఆయన గుర్తుచేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని, తెలంగాణ ఉద్యమ కారులను పక్కన పెట్టి తెలంగాణ వ్యతిరేక పార్టీలో పనిచేసిన వారికి అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, తనను బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గంలో తీసుకుంటున్నారని, అతి కొద్ది రోజుల్లో మరో 100 మందికి పైగా పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.