ఎమ్మెల్యే కారును అడ్డుకున్న మహిళ..

by Sumithra |
ఎమ్మెల్యే కారును అడ్డుకున్న మహిళ..
X

దిశ, చిలుకూరు: మండలంలోని బేతవోలులో బుధవారం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి వెళుతుండగా వంగూరి కవిత అనే మహిళ కారును అడ్డుకుంది. తాను అర్హురాలినైనా తనకు ఇల్లు రాలేదని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని ఆమె ఆరోపించింది. పోలీసులు ఆమెను వెంటనే తమ వాహనంలో తరలించి తరువాత విడిచిపెట్టారు. లబ్ధిదారుల ఎంపిక విషయమై బేతవోలు సర్పంచ్ వట్టికూటి చంద్రకళ నాగయ్య ఆధ్వర్యంలో ఇటీవల ఇళ్లు రాని దరఖాస్తుదారులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed