భావి తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది : ఎమ్మెల్యే

by Kalyani |
భావి తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది : ఎమ్మెల్యే
X

దిశ, బొమ్మలరామారం : సమాజంలో విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్ది భావి భవిష్యత్తుకు మార్గదర్శకులుగా రూపొందించే బాధ్యత వహిస్తున్న ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లు అన్నారు. శనివారం మండలంలోని జలాల్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పెండెం నాగార్జున,గుర్రం శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ తూముల వెంకటేశ్వరరావుల పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి సమాజంలో గౌరవనీయమైన పాత్ర ఉంటుందన్నారు.

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించిన ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థికి విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేసి పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ ఎం నరసింహ,ప్రజా ప్రతినిధులు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Next Story