రాజుకున్న 'ఆంజనేయ' వివాదం..

by Naveena |
రాజుకున్న ఆంజనేయ వివాదం..
X

దిశ, చిలుకూరు: మండలంలోని రామాపురం(కట్టకొమ్ముగూడెం) లో బుధవారం ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొన్న విషయం విదితమే. కోదాడ నియోజకవర్గ స్థాయి, మండల అధికారులు, పోలీసులు గురువారం సమస్య పరిష్కారానికి ఆ గ్రామానికి వెళ్లారు. విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, మహిళా మోర్చా నియోజకవర్గ, మండల నాయకులు విగ్రహం ఎదుట భజనల రూపంలో తమ నిరసన వ్యక్తం చేశారు. విగ్రహానికి పూజలు నిర్వహించారు. అక్కడే భోజనాలు చేశారు. వారికి సర్ది చెప్పేందుకు కోదాడ రూరల్ సీఐ రజితా రెడ్డి, చిలుకూరు తహశీల్దార్ ధృవ్ కుమార్, ఎంపీడీవో కందాళ గిరిబాబు, ఎస్సై సురభి రాంబాబు ప్రయత్నించారు. బీజేపీ, అనుబంధ సంస్థల సభ్యులు ససేమిరా అనడంతో అక్కడి నుంచి అధికారులు వెనుతిరిగారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ..విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తామని అన్నారు. బీజేపీ నియోజకవర్గ నాయకులు కనగాల నారాయణ, యశ్వంత్, యాదా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed