- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహమ్మారి సమయంలో వైద్యాధికారుల నిర్లక్ష్యం.. వేడుకుంటున్న ప్రజలు
దిశ తుర్కపల్లి(ఎం): అక్కడ చూడటానికి ఆసుపత్రి ఉంది కానీ ప్రాణం సుస్థి చేస్తే మందులు ఇవ్వడానికి వైద్య సిబ్బందే లేరు. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి(ఎం) లో నెలకొంది. ఒక వైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ అధికంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కేసులను ఉద్దేశించి బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆదివారం కూడా పనిచేయాలని, ఆరోగ్య సిబ్బంది రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ అవేమీ పట్టనట్టు తుర్కపల్లి పి.హెచ్.సి సెంటర్ సిబ్బంది వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో వారి నిర్లక్ష్యం పట్ల మండల ప్రజల తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
నాలుగు రోజుల ముందే షోకాజ్ నోటీసులు..
ఇదిలా ఉంటే ఈ నెల 12 వ తేదీన వైద్యుల పర్యవేక్షణ లేకుండా పల్లెపహాడ్ పి.హెచ్.సి పరిధిలో గల ధర్మారం గ్రామంలో ఆశా వర్కర్ జీ విజయ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న ఫొటోస్ జిల్లా వైద్యాధికారి సాంబశివరావు వరుకు వెళ్లాయి. దీంతో వెంటనే స్పందించిన ఆయన సదురు ఆశా వర్కర్ పైనే కాకుండా సంబంధిత అధికారులు మండల వైద్యాధికారి సీహెచ్.చంద్రారెడ్డి, పల్లెపహాడ్ ఎంపీహెచ్ఏ కరీం బీ, ఏఎన్ఎం డి.పద్మావతిలకు కూడా నోటీసులు పంపించారు. అంతేకాకుండా సరియైన కారణాలు తెలపకపోతే సదరు వైద్యాధికారి, సిబ్బందిపై సీసీఏ రూల్స్ 1991 ప్రకారం క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకుంటామని ఆయన నోటీసులో పేర్కొన్నారు.
అయితే ఈ నోటీసులు అంది నాలుగు రోజులు కాకముందే మళ్ళీ ఆదివారం రోజు తుర్కపల్లి(ఎం) పి.హెచ్.సి లో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాలి కుర్చీలు దర్శనమిచ్చాయి. కాగా డాక్టర్‌తో పాటు, సి హెచ్ ఓ, ఫార్మసిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, సూపర్వైజర్లు, స్టాఫ్ నర్సులతో పాటు మిగతా సిబ్బంది తమ విదులపట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో కూడా వీరు వ్యవహరిస్తున్న తీరు పట్ల గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు, జిల్లా వైద్య అధికారికి కూడా ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మండల పరిధిలో గల మిగతా సబ్ సెంటర్లు యధావిధిగా కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.