- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యాపేటలో ఠాగూర్ సీన్.. చనిపోయిన విషయం దాచి హాస్పిటల్ నిర్వాకం..!
దిశ నల్లగొండ బ్యూరో: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఠాగూర్ సినిమాలో ఉన్న ఓ సీన్ రిపీట్ అయింది. తప్పుడు ఇంజెక్షన్లు వేసి వ్యక్తి చనిపోవడానికి కారణం అయింది ఓ హాస్పిటల్. పూర్తి వివరాల్లోకి వెళితే జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన శివరాత్రి ఇద్దయ్య ( 62) జమ్మిగడ్డలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మోకాలి నొప్పి చికిత్స కోసం చేరాడు. అయితే ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ కు మొదట ఇంజక్షన్ వేయడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఏదో జరుగుతుందని గమనించి సిబ్బంది మరో ఇంజక్షన్ వేయడం వల్ల రోగి మృతి చెందినట్లు తెలిసింది. ఈ విషయంలో ఆసుపత్రి నిర్వాహకులు తమ తప్పులు కప్పించుకునేందుకు ఠాగూర్ సీన్ క్రియేట్ చేశారు. బంధువులకు సమాచారం ఇవ్వకుండా చనిపోయిన పేషెంట్ ను నిశ్శబ్దంగా గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దయ్య మరణించడంతో తమ తప్పులు కప్పించుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రి యజమాన్యం ప్రభుత్వాసుపత్రికి తరలించిందని రోగి బంధువులు ఆరోపణలు గుప్పిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. అయితే మధ్యవర్తుల ద్వారా గొడవను సద్దుమణిగేలా చేసేందుకు మృతుడి కుటుంబానికి రూ.60వేలు ఖరీదు కట్టి చెల్లించినట్లు సమాచారం. జిల్లాలో వైద్యశాఖ అనుమతి లేని ఆసుపత్రులలో రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.