- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రిలో కనీస వసతులు లేక భక్తుల అరిగోస
దిశ, నల్లగొండ బ్యూరో: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి దేవస్థానం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది . నిత్యం వేలాదిగా దైవ దర్శనానికి వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం పేరుతో రూ.1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కనీస వసతులు కరువయ్యాయి. ఇందుకు నిదర్శనం ఎర్రటి ఎండలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడు కాళ్లు కాలుతుంటే వారి కుటుంబ సభ్యులు కాళ్లకు చున్నీలు కట్టి ఆ వృద్ధుని నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటన అక్కడున్న వారందరినీ కలిసివేసింది. వృద్ధులకు వీల్‌చైర్ లేదు. ఉన్నా ఎక్కడ ఉంటాయో తెలియదు. చెప్పేవారు కరువు... సరైన సమాచారం తెలిపే బోర్డులు కనిపించవు. ఆదివారం వస్తే లిఫ్టులు పనిచేయవు. సిబ్బంది తాళం వేసుకొని వెళ్తారు. గుడిలోకి వెళ్ళకముందే భక్తులకు దేవుడు దర్శనమిస్తుంటాడు. ముఖ్యంగా మండుటెండలో యాదాద్రిలో తీవ్ర ఇబ్బందులు ఎందుర్కుంటున్నప్పటికి అధికారులు మాత్రం అటుపక్క కన్నెత్తి కూడా చూడటం లేదని భక్తులు మండిపడుతున్నారు.