వ్యవసాయ కార్మిక సంఘం నాయకులపై పోలీసుల దాడి దుర్మార్గం.. సీపీఎం నాయకులు

by Sumithra |   ( Updated:2023-05-28 10:59:36.0  )
వ్యవసాయ కార్మిక సంఘం నాయకులపై పోలీసుల దాడి దుర్మార్గం.. సీపీఎం నాయకులు
X

దిశ, మఠంపల్లి : మోతే మండలం విబులాపురం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సమగ్ర విచారణ చేయాలని రోడ్డు పై ధర్నాచేస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు పై ఎస్సై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై స్పందించిన సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పాండు నాయక్ స్థానిక ఎస్సై ను విచారణ జరిపించి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మఠంపల్లి మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకల పై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని కోరారు. అలాగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శ పై దాడిచేసిన స్థానిక ఎస్సైను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని అన్నారు.

కార్మిక సంఘాల పై జరిగిన దాడిపై ప్రజాస్వామ్యవాదులు ప్రజాతంత్ర వాదులు ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోగా అరకొరగా కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వాళ్ళ కార్యకర్తలకు అనరులకు డబ్బులు తీసుకుని ఇవ్వడం తీవ్ర అన్యాయమని ఆయన అన్నారు. ఒకపక్క సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంలో విషయం పై 30% శాతం ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకున్నారని వారి జాతకం బయట పెడతానని హెచ్చరించిన సరే డబుల్ బెడ్ రూమ్ పథకంలో కూడా అదే పునరావృతం అవుతుందని, అన్నారు. నిన్న జరిగిన సంఘటన పై విచారణ జరిపి అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందేలా చేయాలని కోరారు. అలాగే దాడి చేసిన ఎస్సై పై చర్య తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నాయకుల పై అక్రమ కేసులు పెట్టిన వాటిపై వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఎం పార్టీ మండల కార్యదర్శి మాలోత్ బాలునాయక్ మండల కమిటీ సభ్యులు పొడిచేటి రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed