- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ రైతాంగం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంది : ఎమ్మెల్యే బొల్లం
దిశ, కోదాడ: చరిత్రలో నిలిచిపోయే మహా నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా 19 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్ రైతుల పాలిటి దేవుడన్నారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 19 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే రికార్డు అన్నారు.
తెలంగాణ రైతాంగం సీఎం కేసీఆర్ కు రుణపడి ఉందన్నారు. సాహసోపేతమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలో చరిత్ర సృష్టించే నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేవలం తెలంగాణ రైతాంగమే కాదు దేశవ్యాప్తంగా రైతాంగం కేసీఆర్ వైపు చూస్తుందన్నారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి రైతులకు సంక్షేమానికి తీసుకొని నిర్ణయాలను సీఎం కేసీఆర్ తీసుకొని రైతులకు అండగా నిలుస్తున్నారు. రైతులంతా సీఎం కేసీఆర్ బాటలో నడుస్తున్నారని ఇన్ని రోజులు రాజకీయంగా విమర్శించిన ప్రతిపక్షాలకు నోరు మెదపకుండా చేశారని అన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రైతు రుణమాఫీ సంబరాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Read More..
- Tags
- KCR
- mla bollam