- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మచ్చ తూడ్చుకోవడానికా..? భవిష్యత్తు కోసమా.. ?
దిశ, తుంగతుర్తి: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కలహాల కాపురానికి నేలవైన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ స్టైల్ పంథాను మార్చుకుంటున్నారు. ఇంతకాలం క్యాడర్ తో అంటి అంటనట్టుగా మెలిగిన నాయకులంతా ఇప్పుడు ఎవరికివారే తమకు అనుకూలంగా ఉన్న క్యాడర్ వద్దకు వెళ్లడమో..? లేక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాల్లో కలుసుకోవడమో..? లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి వర్గీయుడైన గుడిపాటి నరసయ్య శుక్రవారం శాలిగౌరారం మండల పార్టీ సమావేశం నిర్వహించగా మరో గ్రూపు పార్టీ నేత అద్దంకి దయాకర్ కూడా తనకు అనుకూలమైన క్యాడర్ తో సమావేశం జరపాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 29న నియోజకవర్గంలోని తిరుమలగిరి-అర్వపల్లి పరిధిలోని ఓ ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేసి తనకు అనుకూలంగా ఉన్న 9 మండలాల వారికి సమాచారం చేరవేసినట్లు తెలిసింది.
ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో దాదాపు దశాబ్ద కాలంగా గ్రూపులు ఉప్పు-నిప్పులాగా చిటపటలాడుతున్నాయి. ప్రధానంగా పార్టీలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ గ్రూపులు ఉన్న విషయం తెలిసిందే. దీనికి తోడు సస్పెన్షన్ నుండి బయటపడి పార్టీలోకి చేర్చుకోబడ్డ ప్రముఖ వైద్యులు డాక్టర్ వడ్డేపల్లి రవి(ఎంపీ వెంకట్ రెడ్డి వర్గం) ఉన్నారు. అలాగే మరో ఒకరిద్దరు నేతలు తమకు అనుకూలమైనవారిని కలుసుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో తేలబోయే లెక్కల ప్రకారం ఎటు వెళ్లాలో ? ఎటు వెళ్లకూడదోననే విధంగా సందిగ్ధంగా ఉన్నారు. ఇక ఈ గ్రూపు గొడవలతో తాము ఎటువైపు ఉండాలో ? ఉంటే మరో వర్గంతో చెడు తెచ్చుకోవడం ఎందుకు ? ఒకవేళ నిర్ణయించుకున్న వర్గంలో ఉంటే తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో ? అనే ప్రశ్నలతో క్యాడర్ సతమతమవుతోంది. కొంతమంది అయితే తటస్థంగా ఉంటున్నారు. భవిష్యత్తు పరిణామాలను బట్టి నడుచుకుందాంలే ...! అనే తరహాలో ఉన్నారు. ఈ పరిణామాలన్నీ ఓ దారిలో నడుస్తుంటే మరో దారిలో మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీ అరంగ్రేటం చేసి కాంగ్రెస్ కు చెందిన వారిని తమ వైపు తిప్పుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి పునాదులున్న గ్రామాలను సైతం అధికార పార్టీ పెకిలిస్తూ నాయకులతోపాటు క్యాడర్ ను గద్దల్లాగా ఎగరేసుకుపోతున్నాయి. మొత్తానికి ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు కంటి మీద కునుకు లేకుండా వస్తున్నాయి.
మచ్చ తూడ్చు కోవడానికా..? భవిష్యత్తు కోసమా ?
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై ఇటీవల కాలంగా వివిధ రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. వీటన్నింటిపై పార్టీ క్యాడర్ తో చర్చించి దాన్ని తుడుచుకునే ప్రయత్నాల కోసం 29న సమావేశం ఏర్పాటు చేశారా ? లేక తుంగతుర్తి అసెంబ్లీ నుండి పోటీలో ఉండబోతున్నానంటూ అందరిని కలివిడిగా కలుపుకునే ప్రయత్నాలు చేయబోతున్నారా ? అనే అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంతకాలం తాను క్యాడర్ వద్దకు రాకపోవడానికి గల కారణాలు కూడా వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలా ఉంటే మరో నేత వడ్డేపల్లి రవి ఇప్పటికే జనంలోకి ప్రవేశించారు. అవసరాల మేరకు క్యాడర్ కు వివిధ రకాలుగా దగ్గరవుతున్నారు.