పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

by Nagam Mallesh |
పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ
X

దిశ తిరుమలగిరి : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలోని పాలిటెక్నిక్ కాలేజీలో మిగిలిన సీట్లలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని తిరుమలగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపర్ వై శాంతయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నెల 11వ తేది వరకు కళాశాలలో దరఖాస్తులు స్వీకరిస్తామని,12వ తేదిన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. కళాశాలలో సీట్ల ఖాళీల వివరాలకు https:// tgpolycet.nic.in వెబ్ సైట్ ను దర్శించాలని.. అడ్మిషన్ల అభ్యర్థులు అన్ని ఓరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

స్పాట్ అడ్మిషన్ వివరరాలు.. దరఖాస్తు చివరి తేది:11-08-2024, స్పాట్ అడ్మిషన్ జరుగు తేది:12-08-2024, స్పాట్ అడ్మిషన్ ఫీజు:-పాలిసెట్ అర్హత పొందినవారు రూ/ 5680, పాలిసెట్ అర్హత పొందనివారు.రూ/6180, సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: ఎన్ మల్లయ్య-9912672096, బి రవీందర్ నాయక్ -9951990289.

Advertisement

Next Story

Most Viewed