- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
దిశ చివ్వేంల : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు, దాతలు అందించే ఉచిత స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో రాణించాలని మండల విద్యాధికారి జీ. కళారాణి విద్యార్థులకు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో.. 8వ తరగతి విద్యార్థులకు యన్ యంయంయస్ ఉచిత స్టడీ మెటీరియల్ ను అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టిపియుయస్ అందిస్తున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఉచిత స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని స్కాలర్షిప్ కు ఎంపిక కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి పి యు ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యామా రమేశ్ తో పాటు మాధవి, శ్రీనివాస్, కృష్ణ, నాగార్జున చారి, జాని రెడ్డి శంకర్, బాసు, భవాని సంఘమిత్ర, మణి, వెంకట రమణాచారి, విద్య శ్రీ మల్సూర్, నీలోఫర్, రమాదేవి తదితర ఉపాద్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.