కొత్త తండా పల్లె ప్రకృతి వనంకు నిప్పు.. కాలిపోయిన మొక్కలు

by Sumithra |
కొత్త తండా పల్లె ప్రకృతి వనంకు నిప్పు.. కాలిపోయిన మొక్కలు
X

దిశ, నూతనకల్ : కొత్త తండా పల్లె ప్రకృతి వనంలో గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయిన ఘటన నూతనకల్ మండల పరిధిలోని నూతన కొత్త గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నూతనకల్ మండల పరిధిలోని కొత్త తండా గ్రామంలో డిసెంబర్ 2020 సంవత్సరంలో 12 వందల మొక్కలను నాటారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యంతో ఎండిపోయి కాలిపోతున్నాయి. ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన మొక్కల మధ్యలో ఏపూగా పెరిగిన గడ్డిని తొలగించకపోవడం వల్లనే ఈ చెట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన పల్లె ప్రకృతి వనం ఈ విధంగా కాలిపోవడానికి పర్వేక్షించే అధికారుల నిర్లక్ష్యమా.. అనే భావన గ్రామ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎంతటి బాధ్యులైనా వారిని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed